close

కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా

home

కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా

raji-oldisgoldsongs.blogspot.com

కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా



కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 
గోపెమ్మా  సొగసరి గోపెమ్మా



కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 
గోపెమ్మా  సొగసరి గోపెమ్మా 
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 
గోపెమ్మా  సొగసరి గోపెమ్మా 

చీర దొంగిలించి అయ్యో చిటారు కొమ్మన 
ఉన్నావా .. దాగున్నావా 
చీర తిరిగి ఇస్తేను చేతులెత్తి మొక్కేను

 చీర దొంగిలించి అమ్మీ చిటారు కొమ్మన 
ఉన్నాను ..  దాగున్నాను 
దోరవలపులందిస్తే చీర తిరిగి ఇస్తాను 

కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 
గోపెమ్మా  సొగసరి గోపెమ్మా 

వనవేణువు పలికించేవు అనురాగం చిలికించేవు
వనవేణువు పలికించేవు అనురాగం చిలికించేవు 
మనసేమో కరిగించేవు నను నన్నే మరిపించేవు 
నను నన్నే మరిపించేవు 

పగడాల పెదవులపైన జిగినవ్వులు మెరిపించేవు 
ఉడుకెత్తే వేసవిలోనే  వడగళ్ళను కురిపించేవు 
వడగళ్ళను కురిపించేవు  

కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 
గోపెమ్మా  సొగసరి గోపెమ్మా 

నడుము చూస్తే పిడికెడు పిడికెడు 
నడక చూస్తే హంసలు తడబడు
సొగసు చూస్తే..ఊ ..చూస్తే?..హహహ మతిపోతుంది
సొగసు చూస్తె మతిపోతుంది నీ మనసిస్తే సరిపోతుంది

గోపెమ్మా  సొగసరి గోపెమ్మా 
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 

కన్నె మనసు నీ చేతికందెనని సన్నని నడుమే చెప్తుంది
కన్నె మనసు నీ చేతికందెనని సన్నని నడుమే చెప్తుంది 
ఇచ్చిన మనసు తిరిగి రాదని పచ్చిక పానుపు  పలికింది 
ఈ పచ్చిక పానుపు పలికింది

కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా 
గోపెమ్మా  సొగసరి గోపెమ్మా 


 చిత్రం - సప్తస్వరాలు (1969)
సంగీతం - T.V. రాజు 
గీతరచన - సి. నారాయణ రెడ్డి 
గానం - ఘంటసాల,సుశీల
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా

Report "కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా "

Are you sure you want to report this post for ?

Cancel
×