close

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి

home

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి

raji-oldisgoldsongs.blogspot.com

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి



ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో



ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో
ఏవేవో వలపు తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో

కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి 
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది 
కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి 
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది 

మరపురాని తొలిరేయి మరల రానిది 
మరపురాని తొలిరేయి మరల రానిది 
మగువ జీవితాన ఇదే మధురమన్నది 

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో

ఒక్క క్షణం .. ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది 
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది 
ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది 
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది 

కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
 కన్నె మనసు ఏవేవో కలలు కన్నది 
ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది  

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో

తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి 
తీసియున్న తలపులను మూయమన్నది 
తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి 
తీసియున్న తలపులను మూయమన్నది 

మనసు తోటి తనువు కూడ నీది కానున్నది 
మనసు తోటి తనువు కూడ నీది కానున్నది 
మనుగడ ఈ నాటితో మనది కానున్నది 

 ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 
ఏవేవో వలపు తలపులురుకుతున్నవి 
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో


చిత్రం - సుమంగళి (1965) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - పి. బి. శ్రీనివాస్, జానకి

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి

Report "ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి"

Are you sure you want to report this post for ?

Cancel
×