close

బులి బులి ఎర్రని బుగ్గలదాన

home

బులి బులి ఎర్రని బుగ్గలదాన

raji-oldisgoldsongs.blogspot.com

బులి బులి ఎర్రని బుగ్గలదాన



బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నులదాన



బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నులదాన
మరచి పోయావా నువ్వే మారిపోయావా
అయ్యో .. మరచి పోయావా నువ్వే మారి పోయావా

చెడ్డ దారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే
చెడ్డ దారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే

మంచి మాట నీ నోట వినాలని
ఓహొ .. రాధా .. ఒక మంచి మాట
ఒక మంచి మాట నీ నోట వినాలని
మనసు మార్చుకుని వచ్చానే..  వచ్చానే

బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా
మరచి పోయావా నువ్వే మారిపొయావా
అయ్యో..  మరచి పోయావా నువ్వే మారిపొయావా

బొమ్మల పెళ్ళి చేశావే ఈ బొమ్మకు హారం వేశావే
చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
ఆయ్యో  రాధా... నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
నన్నే  కాదని అంటావే ..  అంటావే

బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా
మరచి పోయావా నువ్వే మారిపోయావా
అయ్యో ..  మరచి పోయావా నువ్వే మారిపోయావా

ఎవడో రాజా అంటావే నీ రాజానే కాదంటావే
ఎవడో రాజా అంటావే నీ రాజానే కాదంటావే
కళ్ళు తెరుచుకో.. కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో .. చూసుకో

బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా
మరచి పోయావా నువ్వే మారిపోయావా
అయ్యో ..  మరచి పోయావా నువ్వే మారిపొయావా


చిత్రం - శ్రీమంతుడు (1971)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల
బులి బులి ఎర్రని బుగ్గలదాన

Report "బులి బులి ఎర్రని బుగ్గలదాన"

Are you sure you want to report this post for ?

Cancel
×