close

చేతులు కలిసిన చప్పట్లూ

home

చేతులు కలిసిన చప్పట్లూ

raji-oldisgoldsongs.blogspot.com

చేతులు కలిసిన చప్పట్లూ



చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు




చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

పాలూ తేనె కలిసిన మాదిరి 
ఆలు మగలు ఉండాలి
పాలూ తేనె కలిసిన మాదిరి 
ఆలు మగలు ఉండాలి

గువ్వల జంట కులికే రీతిగ
నవ్వుల పంట పండాలీ 
నవ్వుల పంట పండాలీ

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

కొత్త కుండలో నీరు తియ్యన 
కోరిన మగవాడే తియ్యన
కొత్త కుండలో నీరు తియ్యన 
కోరిన మగవాడే తియ్యన

కొత్త కాపురం చక్కని వరము 
కోరిక తీరు రయ్ రయ్యన

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

వన్నెల చిన్నెల వలపు తోటలో 
పూల బాటలే వెయ్యాలి
వన్నెల చిన్నెల వలపు తోటలో 
పూల బాటలే వెయ్యాలి

అన్యోన్యంగా దంపతులెపుడు
కన్నుల పండుగ చేయాలీ 
కన్నుల పండుగ చేయాలీ

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల,మాధవపెద్ది సత్యం,సుశీల

Share

2 Comments on ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ : చేతులు కలిసిన చప్పట్లూ

  • shyam
    on April 21, 2020 | 00:22 shyamsaid :
    "గీతరచన కొసరాజు గారు కాదు.

    శ్యామ్"
  • రాజ్యలక్ష్మి.N
    on April 23, 2020 | 23:08 రాజ్యలక్ష్మి.Nsaid :
    "గీతరచన "కొసరాజు" గారు కాదు.
    "ఆరుద్ర" గారు.. కరెక్ట్ చేశాను
    ధన్యవాదాలు "
చేతులు కలిసిన చప్పట్లూ

Report "చేతులు కలిసిన చప్పట్లూ"

Are you sure you want to report this post for ?

Cancel
×