close

హోయ్ తళుకు తళుకుమని

home

హోయ్ తళుకు తళుకుమని

raji-oldisgoldsongs.blogspot.com

హోయ్ తళుకు తళుకుమని





హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే



హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే

హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ

రమ్మనకు హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ  చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకు హొయ్ రమ్మనకు 

చీకటి ముసిరేదెన్నడు నా చేతికి అందేదెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగేదెన్నడు 
నీ బుగ్గలు పిలిచేదెన్నడు

హోయ్ కదిలే కన్నులు మూసుకో
హోయ్ కదిలే కన్నులు మూసుకో
మదిలో మగువను చూసుకో
రమ్మనకు.. హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు

నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితివెందుకు
మొన్నటి కలలో మత్తుగా కను సన్నలు చేసితివెందుకు
అంతకు మొన్నటి రాతిరీ .. అంతకు మొన్నటి రాతిరీ
గిలిగింతలు మొదలైనందుకు

రమ్మనకూ  హోయ్ ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకూ  హొయ్ రమ్మనకూ  


చిత్రం - రాముడు-భీముడు (1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, సుశీల  

Share

1 Comments on ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ : హోయ్ తళుకు తళుకుమని

  • తెలుగోడు_చైతన్య
    on May 19, 2020 | 15:13 తెలుగోడు_చైతన్యsaid :
    "ఎంతటి సాహిత్యమైనా గానీ మరల మరల అప్పటి మధురాల కోసం...ఈ అపాత మధురాలని చవిచూడాలిసిందే... వింటున్నాను...🤝"
హోయ్ తళుకు తళుకుమని

Report "హోయ్ తళుకు తళుకుమని"

Are you sure you want to report this post for ?

Cancel
×