నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
మొదలు మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళీకాగానే చేస్తారు మోసం
ఆ..ఆ.. ఆడవారంటే శాంత స్వరూపాలే
కోపతాపాలే రావండి పాపం
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
నేడు శ్రీమతికి మా తోటి వివాదం
తగువే భలే వినోదం ఎందుకో.. తగువే భలే వినోదం
నేడు శ్రీమతికి మా తోటి వివాదం
వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
ఆ..ఆ.. తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే.. భలే వినోదం..ఆ...నిజమే భలే వినోదం
ఆ.. నిజమే.. భలే వినోదం
చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల
No comments yet