close

ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా

home

ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా

raji-oldisgoldsongs.blogspot.com

ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా



ఏరా మనతోటి గెలిచే  ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి



ఏరా మనతోటి గెలిచే  ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి 
ఏరా మనతోటి గెలిచే  ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి .. ఏరా

ఆంజనేయుడికి అన్నదమ్ములం 
భీమసేనుడికి పెద్దకొడుకులం .. అద్దిరబన్నా 
లోభుల నెత్తిని మొట్టేవాళ్ళం 
లోకులకెప్పుడు పెట్టేవాళ్ళం .. అద్దిరబన్నా 

ఈ సీమకు మేమే  రాజులం అః తిండికి పోతురాజులం 
అరె .. సాగితే మహారాజులం 
అరె .. చతికిలపడితె తరాజులం
అరె .. చతికిలపడితె తరాజులం  

ఏరా మనతోటి గెలిచే  ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి .. ఏరా 

 చిన్నా పెద్దా బేధం లేదు 
కొద్దీ గొప్పా తేడా లేదు..  అద్దిరబన్నా 
జుట్టూ జుట్టూ ముడిపెడతాం 
చెవులకు తాటాకులు కడతాం ..  అద్దిరబన్నా 

మా సొంతమన్నదే లేదు .. లేదు 
చుప్పనాతులం కాదు .. కాదు 
ఎప్పుడు కోపం రాదు .. రాదు 
అది వచ్చిందంటే పోదు .. అది వచ్చిందంటే పోదు 

ఏరా మనతోటి గెలిచే  ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి .. ఏరా 


చిత్రం - సువర్ణ సుందరి (1957)
సంగీతం - పి.ఆదినారాయణ రావు 
గీతరచన - కొసరాజు 
గానం - పిఠాపురం

Share

1 Comments on ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ : ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా

  • విన్నకోట నరసింహా రావు
    on May 27, 2020 | 19:55 విన్నకోట నరసింహా రావుsaid :
    "రాజకీయ నాయకులు తమ గురించి పాడుకోగలిగిన పాట 😁😁."
ఏరా మనతోటి గెలిచే  ధీరులెవ్వరురా

Report "ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా"

Are you sure you want to report this post for ?

Cancel
×