close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 2 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

నిన్నరాత్రి నిన్నుచూస్తి కల్లోన పిల్లా



నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా 
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా



నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా 
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా 
నిన్నరాత్రి నిన్ను చూస్తి  కల్లోన పిల్లా 
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా 

నిద్దురలోనా  ఉలిక్కిపడితే
నిద్దురలోనా ఉలిక్కిపడితే బెదురేదోలే అనుకున్నా 
నిద్దురలోనా ఉలిక్కిపడితే బెదురేదోలే అనుకున్నా 
చక్కిలిగింతలు పెడితేను చలిగాలెమో అనుకున్నా 
చక్కిలిగింతలు పెడితేను చలిగాలెమో అనుకున్నా 

కళ్ళు తెరిచి చూశానే నాఎదుటే నువ్వూ ఉన్నావే 
కళ్ళు తెరిచి చూశానే నాఎదుటే నువ్వూ ఉన్నావే 
 నమ్మలేక నీ ఒళ్ళంతా  తడిమి తడిమి చూశానే 

నిన్నరాత్రి నిన్ను చూస్తి  కల్లోన పిల్లా 
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా 

చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపావు 
మెల్లగా  చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు 
చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపావు 
మెల్లగా  చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు 

మెలికలుచూసి చెమటలుపోసి పసివాడ్నై పడి పోయాను
మెలికలుచూసి చెమటలుపోసి పసివాడ్నై పడి పోయాను
లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను 

నిన్నరాత్రి నిన్ను చూస్తి  కల్లోన పిల్లా 
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా

నిలబడు నిలబడు నిమిషంసేపు 
నిలబడు నిలబడు నిమిషంసేపు నీలికన్నుల చినదానా 
నిలబడు నిలబడు నిమిషంసేపు నీలికన్నుల చినదానా 
నువ్వూ నిలవకపోతే  నా ప్రాణాలు నిలవనంటవే పిల్లదానా 
నువ్వూ నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిల్లదానా 

దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా 
దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా 
తోవకు అడ్డం పడుకుంటాను 
తొక్కైనాపోరాదా.. తొక్కైనాపోరాదా 

 నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా 
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
 తెల్లారేకల్లా... హోయ్... తెల్లారేకల్లా


చిత్రం -  కన్నతల్లి (1972) 
సంగీతం -  కె. వి. మహదేవన్
 గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం  - ఘంటసాల 

నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ



నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ 
నీతోటి ఉండాలీ నే నవ్వుతు ఉండాలి



నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ 
నీతోటి ఉండాలీ నే నవ్వుతు ఉండాలి 
నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ 
నీతోటి ఉండాలీ నే నవ్వుతు ఉండాలి

అద్దమందు నాకు నేనే ముద్దువచ్చే వేళలో 
ఆపలేని పొంగులేవో హద్దుమీరే వయసులో 
హద్దుమీరే పొంగులాపి ముద్దు చేసేటందుకు 
ముద్దు వొచ్చే నీకు నేనే అద్దమయ్యేటందుకు 

నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ 
నీతోటి ఉండాలీ నే నవ్వుతు ఉండాలి
 
దుడుకు చేసే దోరవయసు ఉరకలెత్తే వేళలో 
పడుచువానికి పండువెన్నెల పగైపోయే జాములో 
నిమిష నిమిషం ఉలికిపడుతూ నిదుర చెదరే రేయిలో 
నిన్నకలలే కన్నెమనసు నెమరువేసే హాయిలో 

నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ 
నీతోటి ఉండాలీ నే నవ్వుతు ఉండాలి
 
 వల్లమాలిన వలపులన్నీ ఒళ్లు విరిచేటందుకు 
ఆశలన్నీ అలసిపోయి ఆవులించేటందుకు 
ఒకరి కొకరు వోడిపొయి ఒక్కటయ్యేటందుకు 
పగలురేయి ఒకటిచేసి పరవశించేటందుకు 

నువ్వు కావాలి నీ నవ్వుకావాలీ 
నీతోటి ఉండాలీ నే నవ్వుతు ఉండాలి


చిత్రం - కన్నతల్లి (1972) 
సంగీతం -  కె. వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, సుశీల


నీలి మేఘమా జాలి చూపుమా



 నీలి మేఘమా జాలి చూపుమా 
ఒక నిముష మాగుమా



 నీలి మేఘమా జాలి చూపుమా 
ఒక నిముష మాగుమా 
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా 

కన్నె అందమా కలత మానుమా 
ఒక్క నిముషమాగుమా 
నీ దైవము నీ కోసము ఎదుట నిలిచె చూడుమా 

అనుకోని రాగాలు వినిపించెనే 
కనరాని స్వర్గాలు దిగివచ్చెనే 
అనుకోని రాగాలు వినిపించెనే 
కనరాని స్వర్గాలు దిగివచ్చెనే

కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా 
రా.. జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ  నను చేరగా 

నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిముషమాగుమా 
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా

కళ్యాణ మేళాలు మ్రోగించనా 
కంఠాన సూత్రాన్ని ముడివేయనా 
కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా

గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా 
నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా

కన్నె అందమా కలత మానుమా 
ఒక్క నిముషమాగుమా 
నీ దైవము నీ కోసము ఎదుట నిలిచె చూడుమా 


చిత్రం - అమ్మాయిల శపథం (1975) 
సంగీతం - విజయ్ భాస్కర్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - బాలు, వాణీ జయరాం 


మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం



మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం



మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం

స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారూ
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారూ
స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారూ
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారూ

మబ్బువెంట నీరువలే పువ్వునంటు తావివలే
మబ్బువెంట నీరువలే పువ్వునంటు తావివలే
అనుశృతముగా వచ్చును ఈ సంబంధం ఈ అనుబంధం
ఆలుమగలు బ్రతుకున పండించుకొన్న పరమార్థం 
మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్దకం ఆడజన్మ సార్దకం

ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నది
ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నది

అంతా అనురాగమయం ఆనందానికి నిలయం
అంతా అనురాగమయం ఆనందానికి నిలయం
పతి హృదయమే సతికి
నిత్య సత్యమైన ఆలయం పూజించే దేవాలయం
భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం వెలసిన దైవం

మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం


 
చిత్రం  - కులగౌరవం (1972)
సంగీతం  - టి. జి. లింగప్ప
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల

అదే నీవంటివి అదే నేవింటిని



అదే నీవంటివి అదే నేవింటిని 
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని


అదే నీవంటివి అదే నేవింటిని 
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని 
అదే నీవంటివి అదే నేవింటిని 
ఏమి అనలేని బిడియాన ఔనంటిని 

అదే నీవంటివి అదే నేవింటిని 

ఎవ్వరు లేని పువ్వులతోట ఇద్దరు కోరే ముద్దులమూట 
 ఎవ్వరు లేని పువ్వులతోట ఇద్దరు కోరే ముద్దులమూట
ఎదలో కదలాడె పెదవుల తెరవీడి 
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట .. ఓ..ఓ..ఓ 

అదే నీవంటివి అదే నేవింటిని

పున్నమిరేయి పూచిన చోట  కన్నులు చేసే గారడి వేట 
పున్నమిరేయి పూచిన చోట  కన్నులు చేసే గారడి వేట 
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి 
తనువే జిల్లన కవ్వించిన ఆ మాట .. ఓ..ఓ..ఓ

 అదే నీవంటివి అదే నేవింటిని 

నిన్నూ నన్నూ కలిపిన బాట  నీలో నాలో పలికిన పాట 
 నిన్నూ నన్నూ కలిపిన బాట  నీలో నాలో పలికిన పాట
జాబిలి సిగ్గిలగా కౌగిలి దగ్గరగా 
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట .. ఓ..ఓ.. ఓ 

అదే నీవంటివి అదే నేవింటిని
 ఏమి అనలేని బిడియాన ఔనంటిని 
అదే నీవంటివి అదే నేవింటిని


చిత్రం - సప్తస్వరాలు (1969) 
సంగీతం  - టి.వి.రాజు 
గీతరచన - సి.నారాయణరెడ్డి 
గానం : ఘంటసాల, పి.సుశీల 



వగకాడ బిగువేలరా



వగకాడ బిగువేలరా
ఈ  సొగసైన చినదాని బిగికౌగిలీ చేర



వగకాడ బిగువేలరా ..  వగకాడ బిగువేలరా
ఈ  సొగసైన చినదాని బిగికౌగిలీ చేర 
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ  వగకాడ బిగువేలరా

కన్ను సైగలు చేసి చేసీ
నా కడకొంగు నునుకేలదూసీ..ఆ ఆఆ ఆ 
కన్ను సైగలు చేసి చేసీ
నా కడకొంగు నునుకేలదూసీ 

ఎన్నో బాసలు చేసి ఏవో ఆశలు చూపి 
ఎన్నో బాసలు చేసి ఏవో ఆశలు చూపి 
వింత వింత గిలిగింతచేసి 
మరి అంతలోనే మాయమైతివేరా 

వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆఆ 

అర్థ రాతిరి నిదురలేపీ 
చెక్కుటద్దంబుపై  కేలుమోపీ..ఆ ఆ ఆ 
అర్థ రాతిరి నిదురలేపీ 
చెక్కుటద్దంబుపై  కేలుమోపీ

నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి 
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి 
పొంచి పొంచి కవ్వించువేల 
నుడికించనేల చెంతచేర రారా

వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ వగకాడ బిగువేలరా


చిత్రం - తిక్క శంకరయ్య (1968)
సంగీతం - TV.రాజు
గీతరచన - C.నారాయణ రెడ్డి
గానం - :P.సుశీల

ఓ సుకుమారా..



ఓ సుకుమారా.. నను జేరా  రావోయీ..ఇటు రావోయీ
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే



ఓ సుకుమారా.. నను జేరా  రావోయీ..ఇటు రావోయీ
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే

ఓ జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయీ.
కనువుగ నేడూ నీ చెలికాడూ నీ దరినే సుఖించునులే

కోటి కిరణముల కోరినగానీ 
భానుని చూడదు కలువ చెలీ
కోటి కిరణముల కోరినగానీ 
భానుని చూడదు కలువ చెలీ

వెన్నెల కాంతీ వెలిగిన వేళా .. వెన్నెల కాంతీ వెలిగిన వేళా
విరియునుగా  విలాసముగా

నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే

వేయి కనులతో వెదకినగాని 
తారకు జాబిలి దూరమెగా
వేయి కనులతో వెదకినగాని 
తారకు జాబిలి దూరమెగా

కలువల రాణీ వలపులలోనే .. కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా

కనువుగ నేడూ  నీ చెలికాడూ  నీ దరినే సుఖించునులే


చిత్రం - భార్యాభర్తలు ( 1961)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు
గీతరచన - శ్రీ శ్రీ
గానం - ఘంటశాల, సుశీల


ఏమిటి ఈ అవతారం



ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం
పాత రోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహారం



ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం
ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం
పాత రోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం

పౌడర్ దెచ్చెను నీకందం బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని తయారైతివా చిట్టి వర్ధనం

చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం

ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా వయ్యారానికి తగనిదాననా
వరుస కాన్పులై వన్నె తగ్గినా అందానికి నే తీసిపోదునా

ఏమిటి నా అపరాధం ఎందుకు ఈ అవతారం

దేవకన్య ఇటు ఓహో... దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం

నీళ్ళు కలపని పాలవంటిది పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు ఊరూవాడకు ఇది తెలుసు 

ఏమిటి ఈ అవతారం ..  చాలును మీ పరిహాసం 
ఏమిటి ఈ అవతారం ..  చాలును మీ పరిహాసం 
 

చిత్రం - చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - కొసరాజు
గానం - మాధవపెద్ది సత్యం,స్వర్ణలత

నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే



నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే 
నా వేషాలన్నీ నీకొరకే



నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే 
నా వేషాలన్నీ నీకొరకే 
నా కొరకా నా కొరకా వేషాలన్నీ నా కొరకా 
నీ మోసాలన్నీ నా కొరకా 

 అడిగిన కోరిక తీరుస్తా నీ అందానికి నే పడిచస్తా 
తళతళ మెరిసే ప్రేమపూసలు 
దండగట్టి నీ మెళ్ళో వేస్తా 

నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే 
నా వేషాలన్నీ నీకొరకే

ఎర్రని ఏగాణీ ఎపుడైనా ఇచ్చిన మొగమేనా 
చీరలు తెచ్చిన మొగమేనా 
ఔనో కాదో కళ్ళు  తుడుచుకుని 
మొగము చూసుకో అద్దంలోనా 

నా కొరకా నా కొరకా వేషాలన్నీ నా కొరకా 
నీ మోసాలన్నీ నా కొరకా 

చిలకల కొలికి చిరాకుమాని కనికరించవే నా పైని 
నీ మనసు నిలపవే నా పైని 
నిలువున బంగరు తాడు వేయించి 
ఊరేగించెద నా రాణి 

ఓహో ఓహో ఓహో ఓహో ఓహో 

చాలుర మామా చాలు నీ నక్క వినయములు చాలు  
నీ టక్కరి కూతలు చాలు 
కల్లలు బొల్లలు దంచావంటే పళ్ళు పదారు రాలు 
నీ పళ్ళు పదారు రాలు 

ఇహీం ఇహీం ఇహీం ఇహీం 


చిత్రం - ఆడపెత్తనం (1958)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - ఘంటసాల,జిక్కి

టక్కరిదానా టెక్కులదానా



టక్కరిదానా టెక్కులదానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే



టక్కరిదానా టెక్కులదానా
టక్కరిదానా టెక్కులదానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే

తుంటరి రాజా తింటావు కాజా
తుంటరి రాజా తింటావు కాజా
వొంటిగ చేసీ కొంటెగ చూసీ వెంటపడతావా

మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
 మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
యిక బూటకమాడీ నాటకమాడే వాటము చాలోయీ
బూటకమాడీ నాటకమాడే వాటము చాలోయీ

తుంటరి తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు తింటావు కాజా
టక్కరి టక్కరి టక్కరి టక్కరి టక్కరిదానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కులదాన

చీరెలు యిస్తా సారెలు తెస్తా చిరుబురుమనకే
చీరెలు యిస్తా సారెలు తెస్తా చిరుబురుమనకే
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
 కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
 
టక్కరి టక్కరి టక్కరి టక్కరి టక్కరిదానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కులదాన

చీరెలు యేలా సారెలు యేలా బేరాల మాటేలా
 చీరెలు యేలా సారెలు యేలా బేరాల మాటేలా
నే కోరినవాడే చేరువకాగా కొరత యింకేలా
నే కోరినవాడే చేరువకాగా కొరత యింకేలా

తుంటరి తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు తింటావు కాజా

బూరెలు చేస్తా గారెలు చేస్తా బూందీ చేస్తానే
 బూరెలు చేస్తా గారెలు చేస్తా బూందీ చేస్తానే
వద్దన్నను మన పెళ్ళికి నేను వడ్డన చేస్తానే
వద్దన్నను మన పెళ్ళికి నేను వడ్డన చేస్తానే

టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా
చక్కనిదానా చిక్కాను నీకేనే


చిత్రం - విమల  (1960)
సంగీతం - ఎస్ ఎమ్ సుబ్బయ్యనాయుడు
రచన - ముద్దుకృష్ణ
గానం - పిఠాపురం నాగేశ్వరరావు,జమునారాణి


నిన్నరాత్రి నిన్నుచూస్తి కల్లోన పిల్లానువ్వు కావాలి నీ నవ్వుకావాలీ నీలి మేఘమా జాలి చూపుమా మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకంఅదే నీవంటివి అదే నేవింటిని వగకాడ బిగువేలరాఓ సుకుమారా.. ఏమిటి ఈ అవతారం నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే టక్కరిదానా టెక్కులదానా

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×