close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 4 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్






దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్



దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

కొండలు కొట్టి.. కొట్టి డ్యాములు కట్టీ.. కట్టి
నీళ్ళను మలిపి... మలిపి చేలను తడిపి... తడిపి
మురిసే చక్కని రోజు మనకు వస్తుందోయ్ వస్తుంది

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

కండల్ని కరగదీయి బండల్ని విసరివెయ్యి 
నీదేలె పైచేయీ 
కండల్ని కరగదీయి బండల్ని విసరివెయ్యి
నీదేలె పైచేయీ

భాగ్యాలు పండునోయి వాకళ్ళు నిండునోయి
భాగ్యాలు పండునోయి వాకళ్ళు నిండునోయి
సిరులు చిందునోయి ఆశలు అందునోయి
సిరులు చిందునోయి ఆశలు అందునోయి

చేయి చేయి కలపాలి రావయా  బావయ్యా

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి
జేజేలు నీకోయీ 
గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి
జేజేలు నీకోయీ 

చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు
ఎందరో తమ రక్తాన్ని చిందించిరి
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే
త్యాగమంటె ఇదే ఇదే.. ఇదే ఇదే ఇదే ఇదే
ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే

అనుభవమ్ము నీదేనోయి  ఆనందం నీదేనోయి
అనుభవమ్ము నీదేనోయి  ఆనందం నీదేనోయి
నిజమౌ శ్రమజీవివంటే  నీవెనోయ్ నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్


చిత్రం - రాముడు-భీముడు (1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల


దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం



దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం



దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 

మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు 
ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు 
ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 

పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు 
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు 
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు 
 బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు 

బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక 
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక 
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం

తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ 
తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ 
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ 
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ 

నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది 
నేనేడిస్తే ఈ లోకం చూసి చూసి నవ్వింది 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 
దేవుడనేవాడున్నాడా.... 


చిత్రం - దాగుడుమూతలు (1964) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, సుశీల

నీకూ నాకూ పెళ్ళంటే నింగీ నేలా మురిశాయీ




నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ



నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ

నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ

కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ 
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ

తెలిసింది నీ ఎత్తూ ఆ ఎత్తే గమ్మత్తూ
తెలిసింది నీ ఎత్తూ  ఆ ఎత్తే గమ్మత్తూ
సందెలో విందులా .. విందులో ..  పొందులా  
అలా.. అలా.. అలా.. అలా

నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ

ఏడడుగులు నడిచావంటే  ఎండ మొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను
ఏడడుగులు నడిచావంటే  ఎండ మొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను

నాలోనే వేడుందీ ..  నీ ధోరణి బావుంది
నాలోనే వేడుందీ ..  నీ ధోరణి బావుంది
ఎండలో .. వానలా .. వానలో .. హాయిలా  
అలా.. అలా.. అలా.. అలా
  
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ

మూడు ముళ్ళూ వేయకముందే నన్నల్లరి చెయ్యొద్దూ 
ఇల్లాలివి కావాలంటే ఇవ్వాలి తొలిముద్దూ
ఏమిటి ఈ చిలిపితనం .. అంతేలే కుర్రతనం
పూవులో .. తేటిలా .. తేటిలో .. పాటలా  
అలా.. అలా.. అలా.. అలా 

నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ


చిత్రం - దొరబాబు (1974)
సంగీతం - జె.వి. రాఘవులు
గీతరచన - ఆంజనేయశాస్త్రి
గానం - రామకృష్ణ, సుశీల

దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే




దేవుడెలా ఉంటాడని ఎవరైనా  అడిగితే
మా అన్నలా ఉంటాడని అంటాను నేనూ



దేవుడెలా ఉంటాడని ఎవరైనా  అడిగితే
మా అన్నలా ఉంటాడని అంటాను నేనూ
అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే
మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేనూ

చెల్లెలున్న ఈ ఇల్లే సిరిమల్లె తోట
మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట
చెల్లెలున్న ఈ ఇల్లే సిరిమల్లె తోట
మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట

అన్నయ్య హృదయమే అందాల మేడ
చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ
కన్నతల్లి తీపి కలల రూపాలం మనము
కన్నతల్లి తీపి కలల రూపాలం మనము 
కోవెలలో వెలిగించిన దీపాలం మనము    

ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా  అడిగితే
మా అన్నలా ఉంటాడని అంటాను నేనూ

అల్లారు ముద్దుగా నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ మరిపించినావు
అల్లారు ముద్దుగా నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ మరిపించినావు

ఇల్లాలివై నీవు విలసిల్లవమ్మా
పిల్లాపాపలతోటి చల్లగ వుండవమ్మా

పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా
పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా
అన్నయ్య దీవెనే శ్రీరామరక్ష         

అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే
మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేనూ
ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే
మా అన్నలా ఉంటాడని అంటాను నేనూ



చిత్రం - దొరబాబు (1974)
సంగీతం - జె.వి. రాఘవులు
గీతరచన - దాశరథి
గానం - ఘంటసాల, సుశీల

బులి బులి ఎర్రని బుగ్గలదాన



బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నులదాన



బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నులదాన
మరచి పోయావా నువ్వే మారిపోయావా
అయ్యో .. మరచి పోయావా నువ్వే మారి పోయావా

చెడ్డ దారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే
చెడ్డ దారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే

మంచి మాట నీ నోట వినాలని
ఓహొ .. రాధా .. ఒక మంచి మాట
ఒక మంచి మాట నీ నోట వినాలని
మనసు మార్చుకుని వచ్చానే..  వచ్చానే

బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా
మరచి పోయావా నువ్వే మారిపొయావా
అయ్యో..  మరచి పోయావా నువ్వే మారిపొయావా

బొమ్మల పెళ్ళి చేశావే ఈ బొమ్మకు హారం వేశావే
చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
ఆయ్యో  రాధా... నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
నన్నే  కాదని అంటావే ..  అంటావే

బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా
మరచి పోయావా నువ్వే మారిపోయావా
అయ్యో ..  మరచి పోయావా నువ్వే మారిపోయావా

ఎవడో రాజా అంటావే నీ రాజానే కాదంటావే
ఎవడో రాజా అంటావే నీ రాజానే కాదంటావే
కళ్ళు తెరుచుకో.. కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో .. చూసుకో

బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా
మరచి పోయావా నువ్వే మారిపోయావా
అయ్యో ..  మరచి పోయావా నువ్వే మారిపొయావా


చిత్రం - శ్రీమంతుడు (1971)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల

కట్టుకున్నా అదే చీర



కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అవే పూలు
ఇంతగ నిన్నే వలచే నన్నే ఎందుకలా చూస్తావూ




కట్టుకున్నా అదే చీర.. పెట్టుకున్నా అవే పూలు
ఇంతగ నిన్నే వలచే నన్నే ఎందుకలా చూస్తావూ
ఇంకా.. ఇంకా.. ఉడికిస్తావూ

కట్టుకున్నా అదే చీర.. పెట్టుకున్నా అవే పూలు

చేద బావిలో చందురూడూ చిలిపిగ మునకేస్తున్నాడు
ఈ మగువ మనసులో మరో చంద్రుడూ 
తగని అల్లరి చేస్తున్నాడూ

చేద బావిలో చందురూడూ చిలిపిగ మునకేస్తున్నాడు
ఈ మగువ మనసులో మరో చంద్రుడూ 
తగని అల్లరి చేస్తున్నాడూ

చంద్రుని మునకలు నీటి వరకేనా
అందగాని అల్లరి అంతవరకేనా.. అంతంతవరకేనా

కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అవే పూలు

మైకం పెంచే మధువేమో చీకటిలా కమ్మేస్తుందీ
ఇల్లాలిచ్చె వలపేమో ఎన్నో జన్మల వెలుగౌతుందీ
మైకం పెంచే మధువేమో చీకటిలా కమ్మేస్తుందీ
ఇల్లాలిచ్చె వలపేమో ఎన్నో జన్మల వెలుగౌతుందీ

వేసిన బంధం కాదంటావా
వేచిన ఆనందం వలదంటావా మరి ఏమంటావూ

కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అవే పూలు
ఇంతగ నిన్నే వలచే నన్నే ఎందుకలా చూస్తావూ
ఇంకా.. ఇంకా.. ఉడికిస్తావూ
కట్టుకున్నా అదే చీర.. పెట్టుకున్నా అవే పూలు


చిత్రం - పొగరుబోతు (1976)
సంగీతం - కె. వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - P.సుశీల

అటు చల్లని వెలుగుల జాబిలి



అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి



అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ

వేగించే ఒంటరి వేళలో 
వణికించే యీ చలిగాలిలో
వేగించే ఒంటరి వేళలో 
వణికించే యీ చలిగాలిలో

 నా తనువే తడబడుతున్నది 
చెలి సాయం కావాలన్నది

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ

ఒక ఆడది ఒంటిగ దొరికితే 
మగవీరుల కుండే తెగులిదే
ఒక ఆడది ఒంటిగ దొరికితే 
మగవీరుల కుండే తెగులిదే

నీ గడసరి వగలిక చాలులే ఉహు 
లొంగే ఘటమిది కాదులే

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి జాబిలీ .. ఈకోమలీ

నీ మదిలో సంగతి తెలుసులే 
అది దాచాలన్నా దాగదులే
నీ మదిలో సంగతి తెలుసులే 
అది దాచాలన్నా దాగదులే

నువు కోసేవన్నీ కోతలే 
నీ పాచికలేవీ పారవులే

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ


చిత్రం - వాడే వీడు (1973)
సంగీతం - సత్యం 
గీతరచన - దాశరధి 
గానం -ఘంటసాల,సుశీల 


ఆడవే జలకమ్ములాడవే



ఆడవే జలకమ్ములాడవే
కలహంస లాగా జలకన్య లాగా




ఆడవే..ఆడవే ..ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే
కలహంస లాగా జలకన్య లాగా
కలహంస లాగా జలకన్య లాగా 

ఆడవే..ఆడవే 

ఆదికవి నన్నయ్య అవతరించిన నేల
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల

ఆడవే..ఆడవే

నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
బౌద్ధమతవృక్షంబు పల్లవించిన చోట
బుద్ధం శరణం గఛ్చామి ధర్మం శరణం గఛ్చామి
సంఘం శరణం గఛ్చామి

కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట
ఆడవే .. ఆడవే

కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయమాలికలందు

ఆడవే ..ఆడవే ఆడవే..ఆడవే 
ఆడవే జలకమ్ములాడవే 


చిత్రం - విచిత్రకుటుంబం (1969)
సంగీతం - టి.వి. రాజు
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, సుశీల

పూవులు పూయును పదివేలు



పూవులు పూయును పదివేలు
భగవానుని మెడలో ఎది వ్రాలు



చిత్రం - గురువును మించిన శిష్యుడు (1963) 
సంగీతం -  ఎస్.పి. కోదండపాణి 
గీతరచన - కృష్ణమూర్తి 
 గానం  - జానకి

చిలకమ్మ పిలిచింది చిగురాకు గొంతుతో


చిలకమ్మ పిలిచింది చిగురాకు గొంతుతో 
గోరొంక వాలింది కొండంత ఆశతో



చిత్రం - సుపుత్రుడు (1971) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, సుశీల
 దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్దేవుడనేవాడున్నాడా అని  మనిషికి కలిగెను సందేహం నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీదేవుడెలా ఉంటాడని ఎవరైనా  అడిగితేబులి బులి ఎర్రని బుగ్గలదానకట్టుకున్నా అదే చీర అటు చల్లని వెలుగుల జాబిలి ఆడవే జలకమ్ములాడవేపూవులు పూయును పదివేలుచిలకమ్మ పిలిచింది చిగురాకు గొంతుతో

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×