వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే అన్నీ ఉన్నా దానివే
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే అన్నీ వున్న దానివే ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా కళ్ళెంపట్టీ .. కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి నడిపే మొనగాడుండాలీ వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే అన్నీ వున్న దానివే ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని తూకంవేసీ.. తూకంవేసి.. పాకంచూసి డెందం ఒకరికె ఇవ్వాలి వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే అన్నీ వున్న దానివే అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే అన్నీ వున్న దానివే ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే
చిత్రం - వాగ్ధానం (1961) సంగీతం - పెండ్యాల గీతరచన - ఆచార్య ఆత్రేయ గానం - ఘంటసాల
నేడు శ్రీవారికి మేమంటే పరాకా తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా నేడు శ్రీవారికి మేమంటే పరాకా మొదలు మగవారు వేస్తారు వేషాలు పెళ్ళీకాగానే చేస్తారు మోసం ఆ..ఆ.. ఆడవారంటే శాంత స్వరూపాలే కోపతాపాలే రావండి పాపం కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు నేడు శ్రీమతికి మా తోటి వివాదం తగువే భలే వినోదం ఎందుకో.. తగువే భలే వినోదం నేడు శ్రీమతికి మా తోటి వివాదం వారి మనసైతే వస్తారు ఆడవారు చేర రమ్మంటే రానేరారు ఆ..ఆ.. తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు అలుక సరదా మీకు అదే వేడుక మాకు అలుక సరదా మీకు అదే వేడుక మాకు కడకు మురిపించి గెలిచేది మీరేలే ప్రణయ కలహాల సరసాలే వినోదం నిజమే.. భలే వినోదం..ఆ...నిజమే భలే వినోదం ఆ.. నిజమే.. భలే వినోదం
చిత్రం - ఇల్లరికం (1959) సంగీతం - టి. చలపతిరావు గీతరచన - కొసరాజు గానం - ఘంటసాల, సుశీల
చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు
ఇద్దరి మధ్య పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు పాలూ తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలి పాలూ తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలి
గువ్వల జంట కులికే రీతిగ నవ్వుల పంట పండాలీ నవ్వుల పంట పండాలీ చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు కొత్త కుండలో నీరు తియ్యన కోరిన మగవాడే తియ్యన కొత్త కుండలో నీరు తియ్యన కోరిన మగవాడే తియ్యన
కొత్త కాపురం చక్కని వరము కోరిక తీరు రయ్ రయ్యన చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు వన్నెల చిన్నెల వలపు తోటలో పూల బాటలే వెయ్యాలి వన్నెల చిన్నెల వలపు తోటలో పూల బాటలే వెయ్యాలి
అన్యోన్యంగా దంపతులెపుడు కన్నుల పండుగ చేయాలీ కన్నుల పండుగ చేయాలీ చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు
ఇద్దరి మధ్య పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు
చిత్రం - ఇల్లరికం (1959) సంగీతం - టి. చలపతిరావు గీతరచన - ఆరుద్ర గానం - ఘంటసాల,మాధవపెద్ది సత్యం,సుశీల
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా అడిగిందానికి చెబుతా ఎంతైనా పందెం గడతా నిల్చెదనోయి గెల్చెదనోయి ఓహో చిన్నవాడా ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి గుట్టుగ తన పని సాధించునది .. వివరిస్తావా ఏదది? అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను కొంగ జపమని ప్రసిద్ధియేను .. ముందుకు వచ్చి కాదను అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం నిల్చెదమోయ్ గెల్చెదమోయ్ ఓహో చిన్నవాడా వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి గడియలోననే ఉన్న చోటకే వడిగా చేరేదేదది అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను ముమ్మాటికి అది మనసేను ఇక.. ముందుకు వచ్చి కాదను అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం నిల్చెదమోయ్ గెల్చెదమోయ్ ఓహో చిన్నవాడా దానమిచ్చి చెడె నెవ్వడు కర్ణుడు... కర్ణుడు తప్పు తప్పు బలి చక్రవర్తి .. హేయ్ బలిచక్రవర్తి జూదానికి నిపుణుండెవ్వడు ధర్మజుడు... ధర్మజుడు తప్పు తప్పు శకుని.. హేయ్ శకుని అన్నదమ్ముల పోరాటంలో సందు చూచుకుని కూల్చిందెవడు భీముడు... భీముడు తప్పు తప్పు రాముడు హేయ్ రాముడు.. శ్రీరాముడు.. శ్రీ రాముడు
చిత్రం - ఇల్లరికం (1959) సంగీతం - టి. చలపతిరావు గీతరచన - కొసరాజు గానం - ఘంటసాల, సుశీల
నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలొ హోయలున్నవే తానా నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తూ ఉంటే నిలువదె నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలొ హోయలున్నవే తానా ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతిపడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నను తోసిపోయేవో నువ్వు కులుకుతు ఘల ఘల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు ఒకసారి నన్ను చూడరాదా చెంతచేరా సమయమిది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా వగలాడి నే నీవాడనే కాదా నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా కోపమా నా పైనా .. నీ నోటి మాటకే నోచుకోలేనా నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలొ హొయలున్నవే తానా నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు ఓ చెలియా.. ఓ మగువా.. ఓ.. లలనా అది నీకే తెలుసు
చిత్రం - ఇల్లరికం (1959) సంగీతం - టి. చలపతిరావు గీతరచన - కొసరాజు గానం - ఘంటసాల
బులి బులి ఎర్రని బుగ్గలదాన చెంపకు చారెడు కన్నులదాన మరచి పోయావా నువ్వే మారిపోయావా అయ్యో .. మరచి పోయావా నువ్వే మారి పోయావా చెడ్డ దారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే చెడ్డ దారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే మంచి మాట నీ నోట వినాలని ఓహొ .. రాధా .. ఒక మంచి మాట ఒక మంచి మాట నీ నోట వినాలని మనసు మార్చుకుని వచ్చానే.. వచ్చానే బులి బులి ఎర్రని బుగ్గలదానా
బొమ్మల పెళ్ళి చేశావే ఈ బొమ్మకు హారం వేశావే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే ఆయ్యో రాధా... నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే .. అంటావే బులి బులి ఎర్రని బుగ్గలదానా
ఎవడో రాజా అంటావే నీ రాజానే కాదంటావే ఎవడో రాజా అంటావే నీ రాజానే కాదంటావే కళ్ళు తెరుచుకో.. కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో కావాలంటే పరీక్ష చేసుకో .. చూసుకో బులి బులి ఎర్రని బుగ్గలదానా