close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: Hero - NTR

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

ఎవరనుకున్నావే ఏమనుకున్నావే



ఎవరనుకున్నావే ఏమనుకున్నావే
చక్కని చెలికాడే చిక్కని నెలరేడే


ఎవరనుకున్నావే  ఏమనుకున్నావే
ఎవరనుకున్నావే  ఏమనుకున్నావే
చక్కని చెలికాడే చిక్కని నెలరేడే
చక్కని చెలికాడే చిక్కని నెలరేడే

ఎవడే .. ఎవడే .. ఇంకెవడే నా ప్రియుడే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే

 ఎగు భుజముల వాడే మగసిరి గలవాడే 
  ఎగు భుజముల వాడే మగసిరి గలవాడే 

ఎవడే .. ఎవడే .. ఇంకెవడే నాప్రియుడే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే

చెంపకు చారడేసి కన్నులతో సంపంగి పూలవంటి వన్నెలతో 
చెంపకు చారడేసి కన్నులతో సంపంగి పూలవంటి వన్నెలతో 
కలలో తానే కనిపించాడే 
కలలో తానే కనిపించాడే .. చెలియా నన్నే కవ్వించాడే 

ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే

అతడే కోరచూపు చూస్తుంటే  ఆపైన పడుచుగాలి వీస్తుంటే
అతడే కోరచూపు చూస్తుంటే  ఆపైన పడుచుగాలి..వీస్తుంటే
ఏదో..ఏదో అయిపోతానే
ఏదో ఏదో అయిపోతానే .. ఎంతో ఎంతో బాగుంటాదే 

చల్లటి నీటిలోనే నేనుంటే వెచ్చని  నారాజు  తోడుంటే
చల్లటి నీటిలోనే నేనుంటే వెచ్చని  నారాజు  తోడుంటే 
మనసే లోలో ఝుమ్మంటాదే 
మనసే లోలో ఝుమ్మంటాదే  .. వలపే అలయై రమ్మంటాదే

ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవడే .. ఎవడే .. ఇంకెవడే నాప్రియుడే 


చిత్రం - అగ్గిపిడుగు (1964)
సంగీతం - రాజన్ నాగేంద్ర 
గీతరచన - సి. నారాయణ రెడ్డి 
గానం - పి.సుశీల, ఎస్.జానకి 


హోయ్ తళుకు తళుకుమని





హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే



హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే

హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ

రమ్మనకు హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ  చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకు హొయ్ రమ్మనకు 

చీకటి ముసిరేదెన్నడు నా చేతికి అందేదెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగేదెన్నడు 
నీ బుగ్గలు పిలిచేదెన్నడు

హోయ్ కదిలే కన్నులు మూసుకో
హోయ్ కదిలే కన్నులు మూసుకో
మదిలో మగువను చూసుకో
రమ్మనకు.. హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు

నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితివెందుకు
మొన్నటి కలలో మత్తుగా కను సన్నలు చేసితివెందుకు
అంతకు మొన్నటి రాతిరీ .. అంతకు మొన్నటి రాతిరీ
గిలిగింతలు మొదలైనందుకు

రమ్మనకూ  హోయ్ ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకూ  హొయ్ రమ్మనకూ  


చిత్రం - రాముడు-భీముడు (1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, సుశీల  

వగకాడ బిగువేలరా



వగకాడ బిగువేలరా
ఈ  సొగసైన చినదాని బిగికౌగిలీ చేర



వగకాడ బిగువేలరా ..  వగకాడ బిగువేలరా
ఈ  సొగసైన చినదాని బిగికౌగిలీ చేర 
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ  వగకాడ బిగువేలరా

కన్ను సైగలు చేసి చేసీ
నా కడకొంగు నునుకేలదూసీ..ఆ ఆఆ ఆ 
కన్ను సైగలు చేసి చేసీ
నా కడకొంగు నునుకేలదూసీ 

ఎన్నో బాసలు చేసి ఏవో ఆశలు చూపి 
ఎన్నో బాసలు చేసి ఏవో ఆశలు చూపి 
వింత వింత గిలిగింతచేసి 
మరి అంతలోనే మాయమైతివేరా 

వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆఆ 

అర్థ రాతిరి నిదురలేపీ 
చెక్కుటద్దంబుపై  కేలుమోపీ..ఆ ఆ ఆ 
అర్థ రాతిరి నిదురలేపీ 
చెక్కుటద్దంబుపై  కేలుమోపీ

నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి 
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి 
పొంచి పొంచి కవ్వించువేల 
నుడికించనేల చెంతచేర రారా

వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ వగకాడ బిగువేలరా


చిత్రం - తిక్క శంకరయ్య (1968)
సంగీతం - TV.రాజు
గీతరచన - C.నారాయణ రెడ్డి
గానం - :P.సుశీల

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్






దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్



దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

కొండలు కొట్టి.. కొట్టి డ్యాములు కట్టీ.. కట్టి
నీళ్ళను మలిపి... మలిపి చేలను తడిపి... తడిపి
మురిసే చక్కని రోజు మనకు వస్తుందోయ్ వస్తుంది

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

కండల్ని కరగదీయి బండల్ని విసరివెయ్యి 
నీదేలె పైచేయీ 
కండల్ని కరగదీయి బండల్ని విసరివెయ్యి
నీదేలె పైచేయీ

భాగ్యాలు పండునోయి వాకళ్ళు నిండునోయి
భాగ్యాలు పండునోయి వాకళ్ళు నిండునోయి
సిరులు చిందునోయి ఆశలు అందునోయి
సిరులు చిందునోయి ఆశలు అందునోయి

చేయి చేయి కలపాలి రావయా  బావయ్యా

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి
జేజేలు నీకోయీ 
గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి
జేజేలు నీకోయీ 

చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు
ఎందరో తమ రక్తాన్ని చిందించిరి
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే
త్యాగమంటె ఇదే ఇదే.. ఇదే ఇదే ఇదే ఇదే
ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే

అనుభవమ్ము నీదేనోయి  ఆనందం నీదేనోయి
అనుభవమ్ము నీదేనోయి  ఆనందం నీదేనోయి
నిజమౌ శ్రమజీవివంటే  నీవెనోయ్ నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్


చిత్రం - రాముడు-భీముడు (1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల


అటు చల్లని వెలుగుల జాబిలి



అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి



అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ

వేగించే ఒంటరి వేళలో 
వణికించే యీ చలిగాలిలో
వేగించే ఒంటరి వేళలో 
వణికించే యీ చలిగాలిలో

 నా తనువే తడబడుతున్నది 
చెలి సాయం కావాలన్నది

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ

ఒక ఆడది ఒంటిగ దొరికితే 
మగవీరుల కుండే తెగులిదే
ఒక ఆడది ఒంటిగ దొరికితే 
మగవీరుల కుండే తెగులిదే

నీ గడసరి వగలిక చాలులే ఉహు 
లొంగే ఘటమిది కాదులే

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి జాబిలీ .. ఈకోమలీ

నీ మదిలో సంగతి తెలుసులే 
అది దాచాలన్నా దాగదులే
నీ మదిలో సంగతి తెలుసులే 
అది దాచాలన్నా దాగదులే

నువు కోసేవన్నీ కోతలే 
నీ పాచికలేవీ పారవులే

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ .. ఓ జాబిలీ


చిత్రం - వాడే వీడు (1973)
సంగీతం - సత్యం 
గీతరచన - దాశరధి 
గానం -ఘంటసాల,సుశీల 


ఎవరనుకున్నావే ఏమనుకున్నావే హోయ్ తళుకు తళుకుమనివగకాడ బిగువేలరా దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్అటు చల్లని వెలుగుల జాబిలి

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×