close

పడిన ముద్ర చెరిగిపోదురోయ్

home

పడిన ముద్ర చెరిగిపోదురోయ్

raji-oldisgoldsongs.blogspot.com

పడిన ముద్ర చెరిగిపోదురోయ్పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్

మచ్చికైన పాల పిట్టను ఓ రాజా .. నా రాజా
మచ్చికైన పాల పిట్టను
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్
మచ్చికైన పాల పిట్టను
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్

నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్
నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్
ఔరౌరా నీ రొమ్ము మీద పుట్టుమచ్చనోయ్

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్

డేగలాగా ఎగిరిపోతివోయ్
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్
డేగలాగా ఎగిరిపోతివోయ్
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్

పాలలోన తేనె కలిసెనోయ్ ఓ రాజా .. నా రాజా
పాలలోన తేనె కలిసెనోయ్
నేడే మన పరువానికి పండుగైనదోయ్

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్

పడిన ముద్ర చెరిగిపోదురోయ్ .. సోగ్గాడా
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ .. సోగ్గాడా
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ .. సోగ్గాడా
పడిన ముద్ర చెరిగిపోదురోయ్


చిత్రం - అదృష్టవంతులు (1969)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - P.సుశీల 

పడిన ముద్ర చెరిగిపోదురోయ్

Report "పడిన ముద్ర చెరిగిపోదురోయ్ "

Are you sure you want to report this post for ?

Cancel
×