close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 3 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివేవన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ ఉన్నా దానివేవన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే

తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
కళ్ళెంపట్టీ .. కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి
నడిపే మొనగాడుండాలీ

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే

అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని
అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని
తూకంవేసీ.. తూకంవేసి.. పాకంచూసి
డెందం ఒకరికె ఇవ్వాలి

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే

అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే
అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే 


చిత్రం - వాగ్ధానం (1961)
సంగీతం - పెండ్యాల
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - ఘంటసాల 

బంగరు నావ బ్రతుకు బంగరు నావబంగరు నావ బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవాబంగరు నావ బ్రతుకు బంగరు నావా
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ బ్రతుకు బంగరు నావా

బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ

అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
కదలిపోవు కాలచక్రమాగిపోవునా

నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావా .. బ్రతుకు బంగరు నావా

అనురాగం వెన్నెలలు అంతరించినా
అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్ని త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ

బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావా .. బ్రతుకు బంగరు నావా

కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
వలపన్నది విఫలమై విలపించుటకా
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా

నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ ..   బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ


చిత్రం - వాగ్ధానం (1961)
సంగీతం - పెండ్యాల
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం  - సుశీల

నేడు శ్రీవారికి మేమంటే పరాకానేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకానేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా
నేడు శ్రీవారికి మేమంటే పరాకా

మొదలు మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళీకాగానే చేస్తారు మోసం
ఆ..ఆ.. ఆడవారంటే శాంత స్వరూపాలే
కోపతాపాలే రావండి పాపం

కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు

నేడు శ్రీమతికి మా తోటి వివాదం
తగువే భలే వినోదం ఎందుకో.. తగువే లే వినోదం
నేడు శ్రీమతికి మా తోటి వివాదం

వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
ఆ..ఆ.. తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు

అలుక సరదా మీకు అదే వేడుక మాకు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే

ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే.. లే వినోదం..ఆ...నిజమే లే వినోదం
ఆ.. నిజమే.. లే వినోదం


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల 

చేతులు కలిసిన చప్పట్లూచేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

పాలూ తేనె కలిసిన మాదిరి 
ఆలు మగలు ఉండాలి
పాలూ తేనె కలిసిన మాదిరి 
ఆలు మగలు ఉండాలి

గువ్వల జంట కులికే రీతిగ
నవ్వుల పంట పండాలీ 
నవ్వుల పంట పండాలీ

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

కొత్త కుండలో నీరు తియ్యన 
కోరిన మగవాడే తియ్యన
కొత్త కుండలో నీరు తియ్యన 
కోరిన మగవాడే తియ్యన

కొత్త కాపురం చక్కని వరము 
కోరిక తీరు రయ్ రయ్యన

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

వన్నెల చిన్నెల వలపు తోటలో 
పూల బాటలే వెయ్యాలి
వన్నెల చిన్నెల వలపు తోటలో 
పూల బాటలే వెయ్యాలి

అన్యోన్యంగా దంపతులెపుడు
కన్నుల పండుగ చేయాలీ 
కన్నుల పండుగ చేయాలీ

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల,మాధవపెద్ది సత్యం,సుశీల

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పిఅడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానాఅడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
అడిగిందానికి చెబుతా ఎంతైనా పందెం గడతా
నిల్చెదనోయి గెల్చెదనోయి ఓహో చిన్నవాడా

ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
గుట్టుగ తన పని సాధించునది .. వివరిస్తావా ఏదది?

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
కొంగ జపమని ప్రసిద్ధియేను .. ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్‌ గెల్చెదమోయ్‌ ఓహో చిన్నవాడా

వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
గడియలోననే ఉన్న చోటకే వడిగా చేరేదేదది

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను
రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను
ముమ్మాటికి అది మనసేను ఇక.. ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్‌ గెల్చెదమోయ్‌ ఓహో చిన్నవాడా

దానమిచ్చి చెడె నెవ్వడు
కర్ణుడు... కర్ణుడు
తప్పు తప్పు బలి చక్రవర్తి .. హేయ్‌ బలిచక్రవర్తి
జూదానికి నిపుణుండెవ్వడు
ధర్మజుడు... ధర్మజుడు
తప్పు తప్పు శకుని.. హేయ్‌ శకుని

అన్నదమ్ముల పోరాటంలో సందు చూచుకుని కూల్చిందెవడు
భీముడు... భీముడు
తప్పు తప్పు రాముడు
హేయ్‌ రాముడు.. శ్రీరాముడు.. శ్రీ రాముడు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారుఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకే
పొదలలో పూ పొదలలో పొంచినా గాలించినా
పొదలలో పూ పొదలలో పొంచినా గాలించినా
కనులకు నే కనిపించనులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

నీడలో దోబూచిగా ఆడకే తారాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
దాగుడు మూతలు చాలునులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

వెదికినా నే దొరకనే పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
ఎన్నటికీ నిను వీడనులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - శ్రీశ్రీ
గానం - ఘంటసాల

నిలువవే వాలు కనులదానానిలువవే వాలు కనులదానా 
వయ్యారి హంస నడకదానానిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా
నీ నడకలొ హోయలున్నవే తానా
నువ్వు కులుకుతు  ఘలఘల నడుస్తూ ఉంటే
నిలువదె  నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా
నీ నడకలొ హోయలున్నవే తానా

ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతిపడినావో
ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో
సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నను తోసిపోయేవో

నువ్వు కులుకుతు  ఘల ఘల నడుస్తు ఉంటే
నిలువదె  నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు

ఒకసారి నన్ను చూడరాదా చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా
వగలాడి నే నీవాడనే కాదా

నువ్వు కులుకుతు  ఘలఘల నడుస్తు  ఉంటే
నిలువదె  నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు

మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా
కోపమా నా పైనా .. నీ నోటి మాటకే నోచుకోలేనా

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలొ  హొయలున్నవే తానా 

నువ్వు కులుకుతు  ఘలఘల నడుస్తు ఉంటే
నిలువదె నా మనసు
ఓ చెలియా.. ఓ మగువా.. ఓ.. లలనా అది నీకే తెలుసు 


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల 


భలేఛాన్సులే లలలాం లలలాం లక్కీఛాన్సులేఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే .. భలేఛాన్సులేభలేఛాన్సులే భలేఛాన్సులే భలేఛాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే .. భలేఛాన్సులే

అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
బావమరుదులే లేకుంటే ఇక అల్లుడుదేలే అధికారం
భలేఛాన్సులే

గంజిపోసినా అమృతంలాగా కమ్మగ ఉందనుకుంటే
బహు కమ్మగ ఉందనుకుంటే
చీ ఛా చీ ఛా అన్న చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి .. భలేఛాన్సులే

ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే భలేఛాన్సులే

జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడి
జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడి
దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవాడికి

భలేఛాన్సులే భలేఛాన్సులే భలేఛాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే

అణిగిమణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
అణిగిమణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
మామ లోభియై కూడబెట్టితే మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది ఇహ మనకే కాదా దక్కేది

అది మనకే ఇహ మనకే అది మనకే
మనకే,మనకే మ మ మ మనకే


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతి రావు 
గీతరచన - కొసరాజు 
గానం - మాధవపెద్ది సత్యం

సరదా సరదా సిగిరెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూసరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

పట్టుబట్టి ఒక దమ్ము లాగితే
స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు 
కడుపు నిండునా కాలు నిండునా వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ 
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ
మీసాలు కాల్చుకోవచ్చూ

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

ఊపిరి తిత్తులు క్యాన్సరు కిదియే కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ 
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ

కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకు ముక్కు ఎగరేస్తారు
నీవెరుగవు దీని హుషారు
థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించినారందుకే
కలెక్షన్లు లేవందుకే

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

కవిత్వానికి సిగిరెట్టు కాఫీకే యిది తోబుట్టు
పైత్యానికి యీ సిగిరెట్టు బడాయి క్రిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు ఆలోచనలను గిలకొట్టు
వాహ్..పనిలేకుంటే సిగిరెట్టూ తిని కూర్చుంటే పొగపట్టూ

రవ్వలు రాల్చే రాకెట్టూ రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


చిత్రం - రాముడు-భీముడు(1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - కొసరాజు
గానం - మాధవపెద్ది ,జమునారాణి 

తగునా ఇది మామా
తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామాతగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా
నిగమ మార్గములు తెలిసిన నీవే ఇటులనదగునా
తగునా ఇది మామా 

అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ 
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ 
నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు 
ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి 

తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా 

పో .. పోర  పొమ్మికన్  పోపోర  పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు 
ఇక రా వలదు రా తగదు .. ఛీ పో  పో 
పో .. పోర  పొమ్మికన్

అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర 
అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర 
నీ సాహసము పరీహాసము నీ సాహసము పరీహాసము 
నిర్భాగ్యుల తోటి సహవాసము సహించను క్షమించను
యోచించను నీ మాటన్ వచ్చిన బాటన్ పట్టుము వేగన్ 

పో .. పోర  పొమ్మికన్  పోపోర  పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు 
ఇక రా వలదు రా తగదు .. ఛీ పో  పో 

కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే
కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనే డైరెక్టుగ స్వర్గానికి 
చీటి నిచ్చువాడనే 
తల్లి లేని పిల్ల ఉసురు తగలదె ఒంటిగ ఉంచగ 

తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా

 ఊరికెల్ల మొనగాడినే అరె... ఊరికెల్ల మొనగాడినే
పెద్ద మిల్లు కెల్ల యజమానినే
నీ డాబూసరి బలే బిత్తరి నీ డాబూసరి బలే బిత్తరి
నిజమేనని నమ్మితి పోకిరి 

దురాత్ముడా.. దుష్టాత్ముడా..గర్వాత్ముడా..  నీచుడా 
ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్
పో .. పోర  పొమ్మికన్  పోపోర  పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు 
ఇక రా వలదు రా తగదు .. ఛీ పో  పో 


చిత్రం - రాముడు-భీముడు (1964) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన -  కొసరాజు 
గానం - ఘంటసాల, మాధవపెద్ది 
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే బంగరు నావ బ్రతుకు బంగరు నావనేడు శ్రీవారికి మేమంటే పరాకాచేతులు కలిసిన చప్పట్లూఅడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పిఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌  నిలువవే వాలు కనులదానాభలేఛాన్సులే లలలాం లలలాం లక్కీఛాన్సులేసరదా సరదా సిగిరెట్టూ తగునా ఇది మామా

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×